Suresh Daggubati: దగ్గుబాటి సురేశ్ బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదు

Criminal case files against Daggubati Suresh Babu and Rana
  • ఓ భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ బాబు, రానా
  • తండ్రీకొడుకులపై నాంపల్లి కోర్టును ఆశ్రయించిన వ్యాపారవేత్త
  • స్థలం విషయంలో బెదిరిస్తున్నారని ఆరోపణ
  • సురేశ్ బాబు, రానాలకు కోర్టు సమన్లు
టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, ఆయన తనయుడు, ప్రముఖ నటుడు రానాలపై ఓ భూ వివాదంలో కేసు నమోదైంది. కొంతకాలంగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారవేత్తకు... సురేశ్ బాబుకు మధ్య వివాదం నడుస్తోంది. స్థలం ఖాళీ చేయాలంటూ సురేశ్ బాబు, రానా దౌర్జన్యానికి పాల్పడ్డారని, సురేశ్ బాబు తనను చంపేస్తానని కూడా బెదిరించారని ప్రమోద్ కుమార్ చెబుతున్నారు. 

ఈ విషయంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు స్పందించడంలేదంటూ, ప్రమోద్ కుమార్ నేరుగా నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ప్రమోద్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదు కాగా... విచారణకు రావాలంటూ కోర్టు సురేశ్ బాబు, రానాలకు సమన్లు జారీ చేసింది.
Suresh Daggubati
Rana Daggubati
Criminal Case
Pramod Kumar
Land Dispute
Film Nagar
Nampally Court
Tollywood

More Telugu News