Nellore District: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

Fire accident in Nellore collectorate
  • శనివారం కలెక్టరేట్‌లో రేగిన మంటలు
  • సెలవు దినం కావడంతో తప్పిన పెను ప్రమాదం
  • మంటల్లో పడి ఎన్నికల సామగ్రి దగ్ధం
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు. మొత్తం రెండు వాహనాలతో మంటలను ఆర్పుతున్నారు. 

నేడు రెండో శనివారం కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేరు. దీంతో.. పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. కాగా.. కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి మొత్తం మంటల్లో పడి దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Nellore District

More Telugu News