Advertisement

ఏపీ సీఎం నివాసం వద్ద భారీగా భద్రత పెంపు

Security tightened around AP CM jagans residence
  • సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన కానిస్టేబుల్ పరీక్ష అభ్యర్థులు
  • ముఖ్యమంత్రి జగన్ నివాసం పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
  • భారీగా పోలీసుల మోహరింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 1000 మంది సీఎం నివాసం వైపు వస్తారన్న సమాచారం అందడంతో భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా.. తాడేపల్లి వైపు వస్తున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. 

కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వారు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించని వారికి మరో ఐదు మార్కులు కలిపితే క్వాలిఫై అవుతారనేది అభ్యర్థుల డిమాండ్. ఈ మేరకు సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు అభ్యర్థులు ఇవాళ తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు నాలుగున్నర లక్షల పైచిలుకు అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడగా..99 వేల మంది క్వాలిఫై అయ్యారు.
Advertisement
YS Jagan

More Telugu News