Dhanush: 'సార్' సినిమాలోని 5 పాటల్లో ఇదే హైలైట్!

  • ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్'
  • సంగీతాన్ని సమకూర్చిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • 'మాస్టారూ' పాటకి సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రి 
  • శ్వేత మోహన్ స్వరం ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల

Sir Songs Relesed

ధనుశ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'సార్ ' సినిమా రూపొందింది. సంయుక్త మీనన్ కథనాయికగా నటించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 17వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా నుంచి, ఒక్కో పాటను వదులుతూ వచ్చారు.

ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. మాస్టారూ .. బంజారా .. మారాజయ్య .. వన్ లైఫ్ .. సంధ్యన ఉదయిద్దాం .. ఈ జాబితాలో మనకి కనిపిస్తాయి. 'బంజారా' పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఇక ఎమోషనల్ సాంగ్ గా 'మారాజయ్య' .. ర్యాప్ తరహా  పాటగా 'వన్ లైఫ్' .. తిరుగుబాటు గేయంగా 'సంధ్యన ఉదయిద్దాం' కనిపిస్తాయి. 

ఇక 'మాస్టారూ .. మాస్టారూ' మాత్రం మనసుకి పట్టుకునేలా సాగుతుంది. 'శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది .. ' అంటూ ఈ పాట మొదలవుతుంది. చక్కని ఫీల్ తో జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను శ్వేత మోహన్ గొప్పగా ఆలపించింది. తేలికైన పదాలతో రామజోగయ్య శాస్త్రి కలం చేసిన విన్యాసం మనసును పట్టుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోందంటే, ఏ రేంజ్ లో పాప్యులర్ అయిందనేది అర్థం చేసుకోవచ్చు.

More Telugu News