Ram Charan: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అభిమాని కోసం తరలివచ్చిన రామ్ చరణ్

  • క్యాన్సర్ తో బాధపడుతున్న మణి కుశాల్
  • మణి కుశాల్ వయసు 9 ఏళ్లు
  • హైదరాబాద్ స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స
  • రామ్ చరణ్ ను కలవాలనుకున్న బాలుడు
  • కలను సాకారం చేసిన మేక్ ఏ విష్ ఫౌండేషన్
Ram Charan fulfilled a dream of a child who is being treated for cancer

తొమ్మిదేళ్ల మణి కుశాల్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. మణి కుశాల్ అభిమాన హీరో రామ్ చరణ్. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాదులోని స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జీవితంలో ఒక్కసారైనా రామ్ చరణ్ ను కలవాలని ఆ చిన్నారి తన కోరికను తల్లిదండ్రులకు తెలిపాడు. ఇప్పుడా చిన్నారి కల నెరవేరింది. అగ్రహీరో రామ్ చరణ్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి మణి కుశాల్ తో మాట్లాడారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న మణి కుశాల్ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ చరణ్ కు తెలియజేశారు. బాలుడి పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన రామ్ చరణ్ స్పర్శ్ ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న మణి కుశాల్ తో మాట్లాడి అతడికి ఆనందం కలిగించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా మణి కుశాల్ కు రామ్ చరణ్ ఓ కానుక కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

More Telugu News