'జబర్దస్త్'కి ముందు విమానాన్ని దగ్గర నుంచి కూడా చూడలేదు: కమెడియన్ రాజమౌళి 

  • 'జబర్దస్త్' ద్వారా కమెడియన్ గా గుర్తింపు 
  • తాగుబోతు పాత్రల ద్వారా పాప్యులర్
  • నల్లవేణు పరిచయం చేశాడని వెల్లడి 
  • ఆర్పీ సపోర్ట్ చేశాడంటూ వివరణ  
Rajamouli Interview

'జబర్దస్త్' ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకరుగా కనిపిస్తాడు. 'జబర్దస్త్'లో ఆయన ఎక్కువగా తాగుబోతు పాత్రలతో ఆకట్టుకునేవాడు. మందు మాటలు .. మందు పాటలతో ఆయన స్కిట్స్ విపరీతంగా నవ్వించేవి. అలాంటి రాజమౌళి, తన కెరియర్ ను గురించి అనేక విషయాలను ప్రస్తావించాడు.  

"మాది వరంగల్ సమీపంలోని ఓ గ్రామం. మొదటి నుంచి కూడా నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. నల్లవేణు ద్వారా నేను 'జబర్దస్త్' కామెడీ షోకి పరిచయమయ్యాను. ఆ తరువాత ఆర్పీ నన్ను బాగా సపోర్ట్ చేశాడు. నేను తాగుబోతు పాత్రలు బాగా చేస్తున్నానని చెప్పి, పేరడీ పాటలు పెట్టి మరింత పాప్యులర్ చేశాడు" అని అన్నాడు. 

"నాగబాబు నన్ను బాగా ప్రోత్సహించారు. ఎంతో ఆత్మీయంగా చూసుకునేవారు. నాలాంటి వారు ఎదగడానికి జబర్దస్త్ ఎంతో హెల్ప్ అయింది. అంతకుముందు విమానాలను దగ్గర నుంచి కూడా చూడలేదు. జబర్దస్త్ పుణ్యమా అని ఎన్నో దేశాల్లో స్కిట్స్ చేయడం కోసం విమానాల్లో తిరిగాను'' అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News