Dhanush: ‘సార్’ సినిమాలో పాత్రపై ధనుష్ స్పందన

After playing professor in Vaathi Dhanush asks fans take education seriously
  • సినిమా కథ ఎంతో నచ్చిందన్న తమిళ స్టార్ నటుడు
  • పిల్లలు చక్కగా చదువుకుని రాణించాలని సూచన
  • తాను మాత్రం చదువును సీరియస్ గా తీసుకోలేదని వెల్లడి
తమిళ నటుడు ధనుష్ నటించిన వాతి (తెలుగులో సార్) ఈ నెల 17న విడుదల కానుంది. ఇదే సినిమా తెలుగులో సార్ పేరుతో రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ధనుష్ ఈ సినిమా గురించి మాట్లాడాడు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.  

ఈ సినిమా గురించి ధనుష్ మాట్లాడుతూ.. మొదట్లో ఈ సినిమా చేసే ఉద్దేశ్యం లేదనీ, అయితే కథ విన్న తర్వాత ఆ థీమ్ తో తాను కనెక్ట్ అయి, ఒప్పుకున్నట్టు చెప్పాడు. ‘విద్య అనేది దేవుడి ప్రసాదంగానే ఇవ్వాలి కానీ, ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ మాదిరి కాదన్నది’ ఈ సినిమా సందేశంగా ధనుష్ తెలిపాడు. ఈ సినిమాలో కథానాయకుడికి ఇద్దరు కొడుకులు ఉండగా, పిల్లలకు విద్య చెప్పించడం ఎంత కష్టమో గ్రహించడం కథలో భాగం. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సినిమాలో కథనాయకుడు పోరాటం సాగిస్తాడు.

పిల్లలు అందరూ చక్కగా చదువుకుని పరీక్షల్లో రాణించాలని ధనుష్ సూచించాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను విలువలతో, సమాజం ఆమోదించేలా పెంచాలని కోరాడు. ఇది చాలా కష్టమైన పనిగా పేర్కొన్నాడు. తాను మంచి విద్యార్థినే అయినప్పటికీ ఎక్కువగా ఆటలాడుతూ ఉండేవాడినని ధనుష్ వెల్లడించాడు. విద్యను సీరియస్ గా తీసుకోలేదన్నాడు. ‘‘పేరెంట్స్ కు ఏం తెలుసు. ఫీజులు కడతారు. కానీ, చదువుకోవడం చాలా కష్టమైన పని’’ అని తాను భావించేవాడినని వెల్లడించాడు. 

Dhanush
Vaathi
sir
professor
tamil
telugu
movie

More Telugu News