Kadiyam Srihari: 14 ఏళ్లు మంత్రిగా ఉండి ఏం చేశావ్?: కడియం శ్రీహరిపై షర్మిల ఫైర్

Sharmila fires on Kadiyam Srihari
  • ఉద్యమాలను అడ్డం పెట్టుకుని పదవులను పొందిన ద్రోహి కడియం అని షర్మిల విమర్శ
  • వైఎస్సార్ తెలంగాణ ద్రోహి అని మాట్లాడుతున్నాడని మండిపాటు
  • నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేని నువ్వు మాట్లాడుతున్నావా అని విమర్శ
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టుతో స్టేషన్ ఘన్ పూర్ కు దివంగత వైఎస్సార్ సాగునీటిని అందించారని... అలాంటి మహానేత తెలంగాణ ద్రోహి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఉద్యమాలను అడ్డుపెట్టుకుని పదవులను పొందిన ద్రోహి కడియం శ్రీహరి అని దుయ్యబట్టారు. 

హామీల రూపంలో శ్రీహరి, బీఆర్ఎస్ నేతలు చేసిన మోసాలను బయటపెడతామని అన్నారు. తెలంగాణకు వైఎస్సార్ వ్యతిరేకి అని కడియం శ్రీహరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని... నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించినందుకు వ్యతిరేకా? లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చినందుకు వ్యతిరేకా? 30 వేల ఇండ్లు ఇచ్చినందుకు వ్యతిరేకా? రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందుకు వైఎస్సార్ వ్యతిరేకా? అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేని నువ్వు కూడా మాట్లాడుతున్నావా? అని ఎద్దేవా చేశారు.
Kadiyam Srihari
BRS
YS Sharmila
YSRTP

More Telugu News