Kangana Ranaut: కియారా, సిద్ధార్థల ప్రేమ నిజమైనది: కంగనా రనౌత్

Kangana Ranaut praises genuine couple Sidharth Malhotra and Kiara Advani for dating in secret
  • కియారా, సిద్ధార్థ్ డేటింగ్ చేస్తున్నారన్న ఓ నెటిజన్
  • అవును నిజమేనంటూ సమర్థించిన కంగనా
  • వారు నిజమై ప్రేమతో చేశారంటూ బదులు
వివాహ బంధంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాను నటి కంగనా రనౌత్ మరోసారి ప్రశంసించారు. కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన వీరు మంగళవారం రాజస్థాన్ లోని జైసల్మేర్ లో వివాహం చేసుకోవడం తెలిసిందే. దీంతో ట్విట్టర్ లో ఓ యూజర్ వీరు డేటింగ్ చేస్తున్నారు..? అని పేర్కొనగా, దీనికి కంగనా రనౌత్ స్పందించింది.

‘‘అవును వారు డేటింగ్ లో ఉన్నారు. కానీ బ్రాండ్ల కోసం కాదు. సినిమాల ప్రమోషన్ల కోసం కాదు. లైమ్ లైట్ లో ఉండేందుకు, ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు వారు అది చేయలేదు. చాలా చిత్తశుద్ధితో, నిజమైన ప్రేమ కలిగిన చూడముచ్చటైన జంట’’ అని కంగనా రనౌత్ బదులిచ్చింది. కియారా, సిద్ధార్థ్ జంటను గతంలోనూ కంగనా పలు సందర్భాల్లో ప్రశంసించింది. 

‘‘ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉంది.. సినిమా పరిశ్రమలో నిజమైన ప్రేమను అరుదుగా చూస్తుంటాం. వీరిద్దరూ కలసి చూడ్డానికి దేవతల మాదిరి ఉన్నారు’’ అని కియారా, సిద్ధార్థ్ వివాహానికి ముందు కంగనా రనౌత్ ట్వీట్ చేయడం గమనార్హం.
Kangana Ranaut
genuine couple
Sidharth Malhotra
Kiara Advani

More Telugu News