Asaduddin Owaisi: మోదీ సర్కారుపై లోక్ సభలో విరుచుకుపడిన అసదుద్దీన్ ఒవైసీ

  • త్రివర్ణ పతాకం నుంచి ఆకుపచ్చని రంగు తొలగిస్తారా? అంటూ ప్రశ్న
  • చైనాను చూసి భయపడకుండా మైనారిటీలకు నిధులు పెంచాలని డిమాండ్
  • పస్మంద ముస్లింల పట్ల ప్రేమ ఉంటే దళిత ముస్లిం హోదా ఇవ్వాలన్న ఒవైసీ
Will Modi govt remove green colour from tricolour Owaisi in Parliament

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేడు లోక్ సభలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. త్రివర్ణ పతాకం నుంచి మోదీ సర్కారు ఆకుపచ్చని రంగును తొలగిస్తుందా? ఆకుపచ్చని రంగుతో ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని? ప్రధాని మోదీ చైనా దురాక్రమణలపై మాట్లాడతారా? బిల్కిస్ బానోకి న్యాయం దక్కుతుందా? అని ప్రశ్నించారు. ముస్లింలు ఆకుపచ్చని రంగును పవిత్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. 

మైనారిటీ పథకాలకు నిధుల కేటాయింపులను తగ్గించడాన్ని విమర్శించారు. ‘‘పస్మంద ముస్లింల పట్ల అంత ప్రేమ ఉంటే వారికి దళిత ముస్లింల హోదా ఇవ్వాలి’’ అని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అలాగే, బీహార్ ముస్లింలకు ఓబీసీ హోదా కావాలన్నారు. హిండెన్ బర్గ్ భారత్ లో ఉండి ఉంటే చట్టవిరుద్ధ చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని సెటైర్ వేశారు. ప్రధాని చైనా పట్ల భయం చెందకుండా, మైనారిటీలకు నిధులు పెంచాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి భారీ కేటాయింపుల నేపథ్యంలో ఒవైసీ ఇలా వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేయడం తెలిసిందే.

More Telugu News