Phone Pay: విదేశాల్లోనూ యూపీఐ సేవలు.. ప్రారంభించిన ఫోన్ పే!

  • యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఫోన్‌పే యూపీఐ సేవలు
  • నగదు మార్పిడి బాధ తప్పినట్టే
  • త్వరలోనే మరిన్ని దేశాలకు విస్తరిస్తామన్న ఫోన్ పే
PhonePe Now in UAE Singapore and other countries

విదేశాల్లోని భారతీయులకు ఫోన్‌ పే శుభవార్త చెప్పింది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా అంతర్జాతీయంగానూ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి తొలి ఫిన్‌టెక్ సంస్థగా ఫోన్‌ పే అవతరించింది. ఈ సేవల వల్ల భారతీయులు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. భారతీయ బ్యాంకు ఖాతా ద్వారా నేరుగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. 

విదేశాల్లో యూపీఐ చెల్లింపుల కోసం అనువైన సాంకేతికతను ఏప్రిల్ 30 లోపు సిద్ధం చేసుకోవాలని భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) గత నెలలోనే ఫిన్‌టెక్ సంస్థలకు సూచించింది. ఇందులో భాగంగానే ఫోన్‌ పే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల వల్ల భారతీయులు అక్కడికి వెళ్లినప్పుడు అక్కడి వ్యాపారులకు యూపీఐ ద్వారా కనుక పేమెంట్స్ చేస్తే విదేశీ కరెన్సీ వారి బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేటప్పుడు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, త్వరలోనే మరిన్ని దేశాలకు వీటిని విస్తరిస్తామని ఫోన్ పే సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి తెలిపారు.

More Telugu News