కోటంరెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది: బోరుగడ్డ అనిల్

  • కోటంరెడ్డిని వాహనానికి కట్టి ఈడ్చుకెళ్తానన్న అనిల్
  • అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
  • కోటంరెడ్డికి సవాల్ విసిరినందుకే తన కార్యాలయాన్ని తగులబెట్టారన్న అనిల్
I have life threat from Kotamreddy says Borugadda Anil

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడైన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించారంటూ వైసీపీ నెల్లూరు రూరల్ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు నిన్న రాత్రి గుంటూరు డొంకరోడ్డులో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని దుండగులు తగులబెట్టారు. తగలబడిన కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోటంరెడ్డికి సవాల్ విసిరినందుకే తన కార్యాలయాన్ని తగులబెట్టారని అన్నారు. టీడీపీ నాయకులే ఈ వ్యవహారాన్ని నడిపించారని మండిపడ్డారు. తన కార్యాలయాన్ని తగులబెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. 

జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడితే వాహనానికి కట్టి ఈడ్చుకెళ్తానంటూ బోరుగడ్డ అనిల్ కోటంరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన కార్యాలయాన్ని అగ్నికి ఆహుతి చేశారు. ఆది యాక్సిడెంటల్ గా జరిగిన ప్రమాదం కాదని... పెట్రోల్ పోసి నిప్పంటించారని అనిల్ ఆరోపించారు. దీని వెనుక టీడీపీ నేత నక్కా ఆనందబాబు హస్తం కూడా ఉందని చెప్పారు. తనకు కోటంరెడ్డి, టీడీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు.

More Telugu News