Muniramaiah: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

Srikalahasti ex mla Muniramaiah joins TDP
  • కుమారుడితో సహా టీడీపీలో చేరిన మునిరామయ్య
  • పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు
  • గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్లిన మునిరామయ్య 
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య టీడీపీలో చేరారు. మునిరామయ్య నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మునిరామయ్యతో పాటు ఆయన కుమారుడు ప్రవీణ్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి చంద్రబాబు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. 

మునిరామయ్య 1985లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మునిరామయ్య... టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంత గూటికి చేరారు.
Muniramaiah
TDP
Chandrababu
Srikalahasti
Andhra Pradesh

More Telugu News