నీకు ధైర్యం ఉంటే ఆ 51 సెకన్ల క్లిప్పింగ్ రిలీజ్ చెయ్: కోటంరెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సవాల్

  • ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి
  • కోటంరెడ్డి 16 సెకన్ల క్లిప్పింగ్ ను విడుదల చేశారన్న అనిల్
  • మొత్తం క్లిప్పింగ్ లో ఏముందో ప్రజలకు తెలియాలని స్పష్టీకరణ
Anil Kumar Yadav challenges Kotamreddy

ఫోన్ ట్యాపింగ్ అంశంతో వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. 

ఇటీవల ఇంటెలిజెన్స్ డీజీ పంపించారంటున్న ఆడియోలో కోటంరెడ్డి కేవలం 16 సెకన్ల క్లిప్పింగ్ మాత్రమే బయటపెట్టారని, కానీ మొత్తం క్లిప్పింగ్ ను కోటంరెడ్డి విడుదల చేయాలని స్పష్టం చేశారు. కోటంరెడ్డికి దమ్ముంటే 51 సెకన్ల క్లిప్పింగ్ విడుదల చేయాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. 

అది ఫోన్ ట్యాపింగా, లేక నీ మనోభావాలు ఏంటి? అనేది ఈ రాష్ట్ర ప్రజలు, మీడియా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. 

"16 సెకన్లు రిలీజ్ చేయడం కాదు, నువ్వు చూపించిన క్లిప్పింగ్ లోనే 51 సెకన్లు అని ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్లు పంపించారని నువ్వు చెబుతున్నావే... ఆ క్లిప్పింగ్ మొత్తం రిలీజ్ చేయమంటున్నాం. నువ్వేం మాట్లాడావో, నీ మనసులో ఏముందో, నీ ఆలోచనా విధానం ఏంటో రాష్ట్ర ప్రజలు చూస్తారు" అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. "నేనక్కడికి వెళతాను, ఇక్కడికి వెళతాను అనడం ఎందుకు? నువ్వు తలచుకుంటే కూసాలు కదులుతాయా? షేక్ అవుతుందా?" అంటూ అనిల్ మండిపడ్డారు.

More Telugu News