Pawan Kalyan: సీఎం జగన్ ను కొత్త పేరుతో సంబోధించిన పవన్ కల్యాణ్

Pawan kalled Jagan as Appu Ratna
  • క్రమం తప్పకుండా అప్పులు తెస్తున్న ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
  • అప్పురత్న జగన్ అంటూ ఎద్దేవా
  • మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దు అని సెటైర్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి వారం క్రమం తప్పకుండా ఆర్బీఐలో బాండ్లను తాకట్టు పెడుతూ అప్పులు తీసుకొస్తున్న జగన్ పై మండిపడ్డారు. సీఎంను అప్పురత్న అంటూ ఎద్దేవా చేశారు. అప్పులతో దేశ వ్యాప్తంగా ఏపీ పేరును మారుమోగిస్తున్నందుకు జగన్ కు ప్రత్యేక శుభాభినందలు అంటూ ఎద్దేవా చేశారు. ఓ వైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ, మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దు అని చెప్పారు. రాష్ట్ర సంపద, భవిష్యత్తును గాలికొదిలేసి... మీ సంపదను పెంచుకోండని విమర్శించారు. 

Pawan Kalyan
Janasena
Jagan
YSRCP

More Telugu News