Samantha: 'శాకుంతలం' రిలీజ్ డేట్ వాయిదా .. అధికారిక ప్రకటన!

  • ఈ నెల 17న రిలీజ్ కావలసిన 'శాకుంతలం'
  • వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్ 
  • త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెబుతామని వెల్లడి
  • సమంత జోడీగా పరిచయమవుతున్న దేవ్ మోహన్
Shaakuntalam release date is postponed

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' కోసం ఆమె అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆ దిశగా పోస్టర్లను వదులుతూ .. అప్ డేట్స్ ఇస్తూ వచ్చారు. 

ఈ సినిమా నుంచి ఒక పాట తరువాత ఒక పాటను వదులుతూ వెళుతున్నారు. ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారనే విషయం ఈ పాటల ద్వారానే అందరికీ అర్థమైపోయింది. ఈ తరహా కథలపై దర్శకుడిగా గుణశేఖర్ కి గల పట్టుకు .. మెలోడీ గీతాలపై మణిశర్మకి గల పట్టుకు ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలవడం ఖాయమని అనుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లకు రావడం లేదనీ, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందనే ఆనందంతో ఉన్న అభిమానులకు నిరాశను కలిగించే వార్తనే ఇది. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా నుంచి, మరో ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి..

More Telugu News