300 కోట్లు కొల్లగొట్టిన విజయ్ 'వరిసు'!

  • తమిళనాట కొనసాగుతున్న 'వరిసు' జోరు 
  • నిన్నటితో 300 కోట్ల గ్రాస్ వసూలు
  • ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా నడిచిన కథ
  • తారాగణం పరంగాను కనిపించిన భారీతనం 
  • హైలైట్ గా నిలిచిన సంగీతం .. ఫొటోగ్రఫీ
Varisu Movie Update

విజయ్ హీరోగా తమిళంలో 'వరిసు' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. తమిళంలో జనవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. అప్పటి నుంచి తన జోరును కొనసాగిస్తూ వెళ్లిన ఈ సినిమా, నిన్నటితో 300 కోట్ల మార్కును దాటేసింది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ను వదిలారు.

దిల్ రాజు నిర్మాణ విలువలకు సంబంధించిన విషయంలో ఎక్కడా రాజీ పడలేదనే విషయం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రతి చిన్న పాత్రలోను స్టార్స్ నే పెట్టారు. అలా ఈ సినిమా భారీతనాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ పరంగా కూడా ఈ సినిమా ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది. విజయ్ సరసన కథానాయికగా రష్మిక నటించిన ఈ సినిమాలో, జయసుధ .. శరత్ కుమార్ .. ప్రకాశ్ రాజ్ .. సుమన్ .. ప్రభు .. 'కిక్' శ్యామ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. 

తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ గనుక 300 కోట్లను కొల్లగొట్టడానికి కొంత సమయం తీసుకుంది. అదే విజయ్ మార్క్ మాస్ మూవీ అయితే, ఈ వసూళ్లను ఎప్పుడో రాబట్టి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా 'వారసుడు' పేరుతో తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే.

More Telugu News