అదే జరిగితే భారత్ లో జరిగే ప్రపంచకప్ ను బహిష్కరిస్తాం: పాక్ క్రికెట్ చీఫ్
- ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్థాన్ వేదికగానే జరగాలన్న పీసీబీ చీఫ్
- వేరే దేశానికి తరలిపోతే తాము భారత్ లో వన్డే క్రికెట్ కప్ కు రాబోమని స్పష్టీకరణ
- ఆసియా కప్ వేదికపై మార్చిలో తుది నిర్ణయం
ఇప్పుడు నజమ్ సేతి కూడా ఇలానే మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియాకప్ జరగాల్సి ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జైషా.. గతేడాది ఓ సందర్భంలో మాట్లాడుతూ ఆసియా కప్ కోసం భారత్ జట్టు పాకిస్థాన్ కు వెళ్లబోదని ప్రకటన చేశారు. దౌత్యపరమైన అంశాలను కారణంగా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో ఆసియాకప్ వేదిక మార్పుపై తుది నిర్ణయం జరగనుంది. గత శనివారం బహ్రెయిన్ లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో పాకిస్థాన్ వైఖరిని నజమ్ సేతి తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ ఏడాది ఆసియా కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే హక్కులను తాము వదులుకునేది లేదని జైషాకి స్పష్టం చేసినట్టు సమాచారం.