కొరటాల మూవీ షూటింగు ఎప్పటి నుంచి ఉంటుందంటే ..!: ఎన్టీఆర్
- 'అమిగోస్' ఈవెంటులో కొరటాల సినిమా ప్రస్తావన
- అప్ డేట్ విషయంలో అసహనాన్ని వ్యక్తం చేసిన ఎన్టీఆర్
- అభిమానుల ఉత్సాహం హీరోలను ఇబ్బంది పెట్టకూడదని వ్యాఖ్య
- తన సినిమా షూటింగ్ వచ్చేనెలలో మొదలవుతుందని వెల్లడి
- 2024 ఏప్రిల్ 5న విడుదలవుతుందని స్పష్టీకరణ
కొరటాలతో సినిమా సంగతి చెప్పమని అభిమానులు అడిగితే, ఆయన వారికి సున్నితంగానే చిన్నపాటి క్లాస్ పీకారు. 'ఎప్పుడూ అప్ డేట్స్ ఇవ్వడానికి ఏముంటాయి?' అంటూ చిరాకును వ్యక్తం చేశారు. తాను మాత్రమే కాదు ఈ విషయంలో హీరోలంతా ఇబ్బంది పడుతున్నారని .. అర్థం చేసుకోమని అన్నారు.
"ఒక మంచి అకేషన్ చూసి చెబుదామని అనుకున్నాను .. అలాంటి అవకాశం వచ్చింది గనుక చెబుతున్నాను. ఈ నెలలో కొరటాల ప్రాజెక్టును లాంచ్ చేసి .. మార్చి 21 .. 22 తేదీలలో షూటింగును మొదలుపెడతాము. 2024 ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తాం" అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ మాటలతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారిపోయింది.