అల్లు అర్జున్ కు ఊహించని కానుక
- పుష్పలో లారీ నడిపిన అల్లు అర్జున్
- అలాంటి లారీ బొమ్మనే కానుకగా ఇచ్చిన తనయుడు అయాన్
- సంతోషంతో పొంగిపోయిన బన్నీ
పుష్పలో అల్లు అర్జున్ ఓ లారీ నడుపుతూ ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే ఓ చిన్న లారీ బొమ్మను అల్లు అయాన్ తన తండ్రికి బహూకరించడం విశేషం. తనయుడి నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న బన్నీ ఆనందం అంతాఇంతా కాదు.
పట్టరాని సంతోషంతో పొంగిపోయిన బన్నీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. నా ముద్దుల కన్న, నా చిన్ని బాబు అయాన్ నుంచి అందిన అందమైన బహుమతి అంటూ అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. అంతేకాదు, తనయుడు కానుకగా ఇచ్చిన బొమ్మ లారీ ఫొటోను కూడా పంచుకున్నారు.