Gudivada Amarnath: పవన్ కు రాయాల్సిన లేఖ నాకు రాసినట్టున్నారు: హరిరామజోగయ్యకు గుడివాడ అమర్నాథ్ కౌంటర్

Gudivada Amarnath replies to Hariramajogaiah letter
  • అమర్నాథ్ పై హరిరామజోగయ్య విమర్శలు
  • నువ్వో బచ్చావి అంటూ వ్యాఖ్యలు
  • రిప్లయ్ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్
మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ ను నాశనం చేయొద్దంటూ కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు లేఖాస్త్రం సంధించడం తెలిసిందే. రాజకీయాల్లో అమర్నాథ్ ఒక బచ్చా అని, పవన్ కల్యాణ్ పై బురదచల్లడం ఆపాలని హరిరామజోగయ్య ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖపై గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఈ లేఖ పొరబాటున తనకు రాసినట్టున్నారని హరిరామజోగయ్యను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. 

"కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కల్యాణ్ గారికి రాయాల్సిన, చెప్పాల్సిన విషయాలు పొరబాటున నాకు రాసినట్టున్నారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అని అమర్నాథ్ తన లేఖలో పేర్కొన్నారు.
Gudivada Amarnath
Hariramajogaiah
Letter
Kapu
Pawan Kalyan
Chandrababu
YSRCP
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News