Bopparaju: మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారు: బొప్పరాజు

  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26 డెడ్ లైన్
  • ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్న బొప్పరాజు
  • డీఏలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని ఆరోపణ
Bopparaju says employees will take further steps if govt not respond

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26వ తేదీ డెడ్ లైన్ అని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 

మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారని, ఇక ఉపేక్షించేది లేదని బొప్పరాజు స్పష్టం చేశారు. డీఏలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నెల 26న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని, ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తామని వెల్లడించారు. 

కాగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలో భాగస్వామ్య సంఘాల సంఖ్య ఇప్పుడు 100కి పెరిగిందని చెప్పారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ బొప్పరాజు ఈ మేరకు వెల్లడించారు.

More Telugu News