‘పఠాన్’ సాధించిన రూ. 700 కోట్ల వసూళ్లలో రూ. కోటి ఇమ్మన్న ఫ్యాన్.. షారుఖ్ ఫన్నీ రిప్లై!

  • ఇప్పటికే రూ. 700 కోట్ల వసూళ్లు సాధించిన ‘పఠాన్’
  • ట్విట్టర్ ద్వారా అభిమానుల ముందుకొచ్చిన షారుఖ్
  • వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చిన ‘పఠాన్’
Fan asks SRK to give him Rs1 cr from Pathaans earnings Shah Rukh Funny  Reply

పలు వివాదాల నడుమ విడుదలైన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. వసూళ్లలో రికార్డులను తిరగరాస్తోంది. వరుస ప్లాపులతో కుంగిపోయిన బాలీవుడ్‌లో ‘పఠాన్’ మళ్లీ ఊపుతెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా దూసుకెళ్తూ మరిన్ని రికార్డులు కొల్లగొట్టే ప్రయత్నంలో ఉంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న షారుఖ్.. తాజాగా ట్విట్టర్‌ ద్వారా అభిమానుల ముందుకొచ్చాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అలరించాడు. ఈ సందర్భంగా ఓ అభిమానికి షారుఖ్ ఇచ్చిన ఫన్నీ సమాధానం వైరల్ అవుతోంది.

పఠాన్ సినిమాను తాను ఐదుసార్లు చూశానని, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఇప్పటి వరకు సాధించిన రూ. 700 కోట్ల వసూళ్లలో తనకు ఓ కోటి రూపాయల షేర్ ఇవ్వాలని ఓ అభిమాని షారుఖ్‌ను కోరాడు. దీనికి ‘పఠాన్’ స్పందిస్తూ.. ‘‘సోదరా.. షేర్ మార్కెట్లో కూడా ఇంత మొత్తంలో రిటర్న్స్ రావు. ఇప్పుడు నువ్వు చూసిన దానికి మరిన్ని రెట్లు ఎక్కువగా చూడు’’ అని ఫన్నీ రిప్లై ఇచ్చాడు. 

‘‘సార్ పఠాన్ సినిమా చూడడం వల్ల ఏంటి ప్రయోజనం?’’ అని మరో యూజర్ షారుఖ్‌ను ప్రశ్నించాడు. దీనికి షారుఖ్.. ‘‘ఓరి దేవుడా! వీరు నిజంగా చాలా లోతుగా ఆలోచిస్తారు. జీవిత పరమార్థం ఏమిటి? దేని ప్రయోజనమైనా ఏమిటి?  క్షమించండి, నేను మరీ అంత లోతుగా ఆలోచించే వ్యక్తిని కాదు’’ అని సమాధానం ఇచ్చాడు.

More Telugu News