సన్నీ లియోన్ పాల్గొనాల్సిన ఈవెంట్ కు సమీపంలో శక్తిమంతమైన పేలుడు
- మణిపూర్ రాజధానిలో శక్తిమంతమైన పేలుడు
- ఫ్యాషన్ షో వేదికకు 100 మీటర్ల దూరంలో పేలుడు
- ఇంఫాల్ లో భారీగా భద్రతా బలగాల మోహరింపు
కాగా, పేలుడు ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగకపోడంతో అధికారవర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంకా ఏ తీవ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. పేలుడు నేపథ్యంలో, ఇంఫాల్ లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఫ్యాషన్ ఈవెంట్ కు సన్నీ హాజరవుతుందా? అనే అంశంపై అనిశ్చితి నెలకొంది.