నా భర్త ఆదిల్ ని అనవసరంగా బిగ్ స్టార్ చేయకండి: రాఖీ సావంత్

  • ఆదిల్ ఖాన్ ను ఓ పెద్ద అబద్ధాల కోరుగా పేర్కొన్న రాఖీ
  • మరో మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ప్రకటన
  • తనను వాడుకుని పరిశ్రమలోకి రావాలని చూశాడంటూ ఆరోపణ
Rakhi Sawant hints at husband Adil Khans extra marital affair

రాఖీ సావంత్, ఆమె భర్త ఆదిల్ ఖాన్ బంధంలో మరోసారి సమస్యలు ఏర్పడ్డాయి. రాఖీ సావంత్ దీనిపై బావోద్వేగానికి గురైంది. ముంబైలోని జిమ్ బయట తనకు కనిపించిన మీడియా ప్రతినిధుల మధ్య బోరున విలపిస్తూ, తన బాధను పంచుకుంది. 

తన భర్త ఆదిల్ ఖాన్ మరో మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని, ఆమె అతడ్ని బెదిరిస్తోందని రాఖీ సావంత్ ఆరోపణలు చేసింది. ఆదిల్ ఖాన్ ఇంటర్వ్యూలు తీసుకోవద్దంటూ మీడియాని కోరింది. కనీసం అతడితో మాట్లాడవద్దంటూ మీడియా వారిని వేడుకుంది. తన వల్లే అతడు వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది. 

‘‘ఆదిల్ నుంచి మీరు ఎలాంటి ఇంటర్వ్యూలు తీసుకోకూడదని కోరుకుంటున్నాను. లేదా అతడ్ని పెద్ద స్టార్ చేయడానికి ప్రయత్నించకండి. అతడు కేవలం నన్ను వాడుకుని పరిశ్రమలోకి రావాలని కోరుకున్నాడు’’ అని రాఖీ సావంత్ పేర్కొంది. 

ఆదిల్ ఒక అబద్ధాల కోరు అని రాఖీ సావంత్ అభివర్ణించింది. ‘‘సదరు అమ్మాయికి దూరంగా ఉంటానని అతడు ఖురాన్ పై ప్రమాణం చేశాడు. దాన్ని అతడు పాటించడం లేదు. అవతలి వైపు అమ్మాయి అతడ్ని బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఆదిల్ కు సంబంధించి అసభ్యకరమైన ఆధారం ఆమె దగ్గర ఉండి ఉంటుంది’’ అని రాఖీ సావంత్ పేర్కొంది. రాఖీ సావంత్ తల్లి జయ గత నెల 28న మరణించడం తెలిసిందే. 

More Telugu News