ఇంత పెద్ద బ్యానర్లో ఇంత త్వరగా చేస్తాననుకోలేదు: హీరో కిరణ్ అబ్బవరం

  • గీతా ఆర్ట్స్ 2 నుంచి 'వినరో భాగ్యము విష్ణు కథ'
  • తిరుపతి చుట్టూ తిరిగే కథ 
  • కిరణ్ అబ్బవరం జోడీగా కశ్మీర 
  • మురళీశర్మ ట్రాక్ హైలైట్ అని చెప్పిన కిరణ్ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్
Vinaro Bhagyamu Vishnu katha Update

కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో నడిచే కథ ఇది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించాడు. మురళీ కిశోర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడీగా కశ్మీర పరదేశి సందడి చేయనుంది. 

ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం .. కశ్మీర పాల్గొన్నారు. కిరణ్ మాట్లాడుతూ .. "ఈ కథ వినగానే నేను ఎంతమాత్రం ఆలోచన చేయలేదు. అంతగా ఫస్టు సిటింగులోనే ఈ కథ నచ్చేసింది. 

గీతా ఆర్ట్స్ 2లో ఇంత త్వరగా చేసే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా అదృష్టంగానే భావిస్తున్నాను. మురళీ శర్మ ట్రాక్ ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. ఆయన ట్రాక్ ను అంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి ఆయన ట్రాక్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News