డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'అమిగోస్' .. ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!

  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'అమిగోస్'
  • ఆయన జోడీగా ఆషిక రంగనాథ్ పరిచయం 
  • ఈ నెల 3వ తేదీన ట్రైలర్ రిలీజ్ 
  • 10వ తేదీన సినిమా విడుదల
Amigos movie update

కల్యాణ్ రామ్ తన కెరియర్లో హీరోగాను .. నిర్మాతగాను ప్రయోగాలు చేశాడు. 'బింబిసార' విషయంలో నిర్మాతగా ఎక్కువగా రిస్క్ చేసిన ఆయన ఘన విజయాన్ని సాధించాడు. ఇక 'అమిగోస్' విషయంలో హీరోగా మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ పాత్రల స్వభావం కూడా వేరుగా ఉంటుందనే క్లారిటీ ఇచ్చేశారు. వైవిధ్యంగా కనిపిస్తున్న కల్యాణ్ రామ్ లుక్స్ చూసిన వాళ్లంతా ఈ సినిమా పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతవరకూ కనిపించని ఒక లుక్ తో ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ జోడీగా ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది.

More Telugu News