ఈ బడ్జెట్ లో అన్ని అంశాలు సమతూకంలో ఉన్నాయి: నిర్మలా సీతారామన్

  • నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల
  • మధ్య తరగతికి ఉపశమనం కలిగించే బడ్జెట్ అని వెల్లడి
  • మహిళా సాధికారతకు ప్రాముఖ్యత ఇచ్చామని వివరణ
Nirmala Sitharaman press meet after budget announcement

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 2023-24 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి బడ్జెట్ పై వివరణ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని అన్నారు. మౌలిక సదుపాయాలు, మధ్య తరగతికి ఉపశమనం కలిగించేలా బడ్జెట్ తీసుకువచ్చామని చెప్పారు. 

మహిళా సాధికారత, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. బడ్జెట్ లో అన్ని అంశాలు సమతూకంగా ఉన్నాయని నిర్మల వెల్లడించారు. ప్రైవేటు రంగాలకు మరింత ఊతం ఇచ్చే బడ్జెట్ అని అభివర్ణించారు. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేశామని అన్నారు. నూతన పన్నుల విధానంలోకి సులువుగా మారొచ్చని తెలిపారు.

More Telugu News