Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు: జగన్ తో సజ్జల, పోలీస్ ఉన్నతాధికారుల కీలక భేటీ

Jagan key meeting with Sajjala and police amid Kotamreddy phone tapping allegations
  • తన ఫోన్ ట్యాప్ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు
  • మ్యాటర్ ను సీరియస్ గా తీసుకున్న జగన్
  • కోటంరెడ్డి అంశంపై రాష్ట్ర హోం శాఖ ప్రకటన చేసే అవకాశం
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో వైసీపీ అధిష్ఠానంపై ఆ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలకలం రేపిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు ఆ కుటుంబానికి తాను ఎంతో విశ్వాసంతో ఉన్నానని... అలాంటి తన ఫోన్ ను ట్యాప్ చేయడాన్ని భరించలేకపోతున్నానని ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నమ్మకం లేని చోట తాను ఉండలేనని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేసిన ఆధారాలను తాను చూపానని దీనిపై పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఆరోపణలను సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాడేపల్లిలోని  సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి, హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తదితరులు సమావేశమయ్యారు. కోటంరెడ్డి వ్యాఖ్యలపై వీరు చర్చించారు. కోటంరెడ్డి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర హోం శాఖ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Kotamreddy Sridhar Reddy
Jagan
Sajjala Ramakrishna Reddy
YSRCP
Phone Tapping

More Telugu News