యూ ట్యూబ్ లో దూసుకెళుతున్న 'దర్శన' సాంగ్!

  • విభిన్నమైన కంటెంట్ తో 'వినరోభాగ్యము విష్ణు కథ'
  • కిరణ్ అబ్బవరం జోడీగా రూపొందిన ప్రేమకథ
  • సంగీతాన్ని అందించిన చైతన్ భరద్వాజ్ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల     
Vinaro Bhagyamu Vishnu katha Update

కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి, మురళీ కిశోర్ దర్శకత్వం వహించాడు. కశ్మీర పరదేశి ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. నాగశౌర్య జోడీగా 'నర్తనశాల' సినిమాతో పరిచయమైన ఆమెకి, తెలుగులో ఇది రెండో సినిమా. 

ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పుంజుకున్నాయి. రీసెంటుగా ఈ సినిమా నుంచి 'దర్శన' అనే పాటను రిలీజ్ చేశారు. తన ప్రియురాలితో కలిసి తాను గడిపిన క్షణాలను గురించి ప్రస్తావిస్తూ హీరో పాడుకునే పాట ఇది. 

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. అలా యూట్యూబ్ లో వదిలిన ఈ పాట ఇలా దూసుకుపోయింది. ఇప్పుడు ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ పోస్టర్ వదిలింది.

More Telugu News