Shaakuntalam: పఠాన్ దెబ్బకు వెనక్కి వెళ్లిపోయిన శాకుంతలం రిలీజ్

Samantha much awaited Shaakuntalam release postponed
  • ఈ నెల 17న విడుదల కావాల్సిన సినిమా
  • ఉత్తరాదిన ఘన విజయంతో దూసుకుపోతున్న పఠాన్
  • స్క్రీన్లు తగినన్ని లభించకపోవచ్చన్న అభిప్రాయం
  • మార్చిలో విడుదలకు ప్రణాళికలు
సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. కానీ, ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు దీన్ని వెల్లడించాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీలో విడుదలకు సినిమా నిర్మాతలు నిర్ణయించారు. అయితే, ఇప్పుడు పఠాన్ సినిమా భారీ వసూళ్లతో రికార్డులు నమోదు చేస్తోంది. పఠాన్ కు భారీ ఆదరణ వస్తున్న ఈ సమయంలో శాకుంతలం హిందీ వెర్షన్ విడుదల సరికాదని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కనుక ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 17న కాకుండా, కొన్ని రోజుల తర్వాతే శాకుంతలం విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. పఠాన్ ఉత్తరాదిన భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. కనుక తగినన్ని స్క్రీన్లు లభించకపోవచ్చని శాకుంతలం టీమ్ భావిస్తోంది. కార్తీక్ ఆర్యన్ నటించిన షెజదా సినిమా సైతం ఫిబ్రవరి 10న విడుదల కావాల్సి ఉండగా, దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దీంతో మార్చి నెలలో శాకుంతలం విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల కానుంది.
Shaakuntalam
movie
release
postponed
pathan
Samantha

More Telugu News