ప్రియాంక చోప్రా కూతురు మాల్టీని చూశారా..? ఫొటోలు ఇదిగో

  • ఇన్ స్టా గ్రామ్ లో కూతురు ఫొటోలను పోస్ట్ చేసిన ప్రియాంక
  • గతేడాది సరోగసీ విధానంలో తల్లిదండ్రులుగా మారిన ప్రియాంక. నిక్ జోనస్
  • ప్రైవసీ కోసం కూతురు ఫొటోలు బయటపెట్టని సెలబ్రెటీ జంట
PRIYANKA AND NICK REVEAL MALTI MARIE FACE FOR THE 1ST TIME

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్ దంపతులు గతేడాది తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. సరోగసీ విధానంలో ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కూతురుకు మాల్టీ మేరిగా నామకరణం చేసిన ప్రియాంక, జోనస్ లు.. కూతురు ఫొటోలను మాత్రం బయటకు వెళ్లడించలేదు. 

పాప అనారోగ్యంతో పాటు ప్రైవసీ కోసం పాపను మీడియా కెమెరాలకు చిక్కనివ్వలేదు. గతేడాది జనవరిలో జన్మించిన మాల్టీ మేరీ మొన్న 15న మొదటి పుట్టిన రోజు జరుపుకుంది. తాజాగా ప్రియాంక తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది. వైట్ డ్రెస్ లో మాల్టీ మేరీ ముద్దొస్తోందంటూ ప్రియాంక అభిమానులు సంబరపడుతున్నారు.

ప్రియాంక భర్త నిక్ జోనస్, ఆయన సోదరులకు అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. సోమవారం జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రియాంక, జోనస్ దంపతులు మాల్టీ మేరీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది. కూతురును ఎత్తుకుని, ఆడిస్తూ కెమెరాలకు పోజిచ్చింది. ఆపై ఈ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పంచుకుంది. దీంతో ప్రియాంక కూతురు మాల్టీ మేరీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More Telugu News