ఇలియానాకు ఏమయిందో వివరించిన ఆమె తల్లి

  • అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇలియానా
  • ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపిన ఆమె తల్లి
  • ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడి
Ileana suffered from food poison says her mother

'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన అద్భుతమైన ఫిగర్ తో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో నటించింది. టాలీవుడ్ లో కోటి రూపాలయకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగింది. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్లు వచ్చేస్తుండటంతో ఆమెకు ఇక్కడ అవకాశాలు రావడం లేదు. 

మరోవైపు, ఇలియానా అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో తాను ఉన్నానంటూ ఇలియానా చేసిన పోస్ట్ ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలో తన కూతురి అనారోగ్యంపై ఆమె తల్లి స్పందించారు. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. దీంతో, ఆమె డీహైడ్రేషన్ కు గురయిందని... ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు. ఇల్లీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

More Telugu News