'బుట్టబొమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. చీఫ్ గెస్టుగా సిద్ధూ జొన్నలగడ్డ!

  • అనిఖ హీరోయిన్ గా 'బుట్టబొమ్మ'
  • హీరోగా సూర్య వశిష్ఠ పరిచయం 
  • మలయాళ మూవీ 'కప్పేలా'కి రీమేక్ 
  • ఫిబ్రవరి 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 4వ తేదీన సినిమా రిలీజ్  
Buttabomma movie pre release date confirmed

అనిఖ సురేంద్రన్ ను తెలుగు తెరకి కథనాయికగా పరిచయం చేస్తూ సితార బ్యానర్ వారు 'బుట్టబొమ్మ' సినిమాను నిర్మించారు. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక అవార్డులను దక్కించుకున్న అనిఖకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలన 'బుట్టబొమ్మ' సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ వేడుకను హైదరాబాదులోని 'పార్క్ హయత్'లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈవెంటుకి సిద్ధూ జొన్నలగడ్డ చీఫ్ గెస్టుగా హాజరు కానున్నాడు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేదిక మొదలు కానుంది. 

ఇది మలయాళంలో విజయవంతమైన 'కప్పేలా' సినిమాకి రీమేక్. ఫారెస్టు ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక గ్రామీణ ప్రాంతంలో నడిచే ప్రేమకథ. లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ అన్ని కలగలసిన కథ ఇది. సూర్య వశిష్ఠ హీరోగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ కనిపించనున్నాడు.

More Telugu News