గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు జాక్‌పాట్!

  • 12 వేల మందిని తొలగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సుందర్ పిచాయ్
  • ఆయన పనితీరును మెచ్చి ఈక్విటీ కాంపెన్సేషన్ ప్రకటించిన గూగుల్
  • 43 శాతంగా ఉన్న పీఎస్‌యూలను 60 శాతానికి పెంచిన ఆల్ఫాబెట్ ఇంక్
 Google CEO Sundar Pichai received massive pay hike

ఇతర టెక్ కంపెనీల బాట పట్టిన గూగుల్ 12 వేల మందిని తొలగిస్తున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ప్రకటించిన ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్.. ఉద్యోగుల తొలగింపునకు పూర్తి బాధ్యత తనదేనని కూడా ప్రకటించారు. ఈ కష్ట సమయంలో బాధిత ఉద్యోగులకు కంపెనీ అండగా నిలుస్తుందని కూడా చెప్పారు. 

తాజాగా, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయానికి కొన్ని వారాల ముందే సుందర్ పిచాయ్ భారీ వేతన పెంపును అందుకున్నారు. సీఈవోగా సుందర్ పిచాయ్ అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని పేర్కొన్న గూగుల్.. అందుకు ప్రతిగా ఈక్విటీ రివార్డు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా 2019లో 43 శాతంగా ఉన్న పెర్మార్మెన్స్ స్టాక్ట్ యూనిట్స్ (పీఎస్‌యూలు)ను 60 శాతానికి సవరిస్తున్నట్టు పేర్కొంది. ఫలితంగా పిచాయ్ వేతనం భారీగా పెరిగింది.

ప్రతి మూడేళ్లకు ఒకసారి గూగుల్ సీఈవోకు ఈక్విటీ కాంపెన్సేషన్ లభిస్తుంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తాజా ప్రకటన నేపథ్యంలో పిచాయ్.. 63 మిలియన్ డాలర్ల విలువైన రెండు పీఎస్‌యూ ట్రాంచ్‌లను, 84 మిలియన్ డాలర్ల విలువైన ఆల్ఫాబెట్ రిస్ట్రిక్టిడ్ స్టాక్ యూనిట్లను అందుకున్నారు. 2018లో మాత్రం ఆయన ఈక్విటీ కాంపెన్షేషన్‌ను తిరస్కరించడం గమనార్హం. తన వేతన ప్యాకేజీ న్యాయంగానే ఉందన్న కారణం చూపి అప్పట్లో ఈ పరిహారాన్ని ఆయన వదులుకున్నారు.

More Telugu News