నా డ్రీమ్ నిజమైంది: 'ప్రేమదేశం' ప్రీ రిలీజ్ ఈవెంటులో అదిత్ అరుణ్

  • అదిత్ అరుణ్ హీరోగా 'ప్రేమదేశం'
  • ఆయన జోడీగా నటించిన మేఘ ఆకాశ్
  • సంగీతాన్ని అందించిన మణిశర్మ 
  • ఈ నెల 3వ తేదీన సినిమా రిలీజ్
Premadesham Pre Release Event

ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఏ మాత్రం కంటెంట్ బాగున్నా భారీ విజయాన్ని అందుకుంటూనే ఉంటాయి. అలాంటి కంటెంట్ తో రూపొందిన సినిమానే 'ప్రేమదేశం'. అదిత్ అరుణ్ .. మేఘ ఆకాశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో మధుబాల ఒక కీలకమైన పాత్రను పోషించారు. 

శిరీష నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించాడు. ఈ నెల 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటులో అదిత్ అరుణ్  మాట్లాడుతూ .. "నా జీవితంలోకి శ్రీకాంత్ సిద్ధం అనే వ్యక్తి వచ్చాడు. ఇంతవరకూ సినిమా చేయలేదనీ .. తీయలేదని చెప్పాడు. నాతో సినిమా చేస్తానంటూ ఒక కథ చెప్పాడు. తనే ఈ సినిమాకి దర్శకుడు .. నిర్మాత కూడా" అన్నాడు. 

"నా లైఫ్ లో నాకు రెండే రెండు కలలు ఉన్నాయి. వర్మగారి సినిమాలో నటించాలి .. మణిశర్మ మ్యూజిక్ చేసిన సినిమాలో నటించాలి అని. ఆ రెండూ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ మధుబాలతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాను తప్పకుండా హిట్ చేస్తారని  ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News