Chintakayala Prabhakar: గుంటూరు సీఐడీ కార్యాలయంలో ముగిసిన చింతకాయల విజయ్ విచారణ

CID questioning on Chintakayala Vijay concludes
  • భారతి పే పోస్టులో చింతకాయల విజయ్ పై విచారణ
  • గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చిన విజయ్
  • 6 గంటలకు పైగా ప్రశ్నించిన సీఐడీ అధికారులు
  • సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్న విజయ్
  • అన్నింటికీ సమాధానం చెప్పానని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ పై గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ ముగిసింది. విజయ్ ని సీఐడీ అధికారులు 6 గంటలకు పైగా ప్రశ్నించారు. భారతి పే అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల నేపథ్యంలో చింతకాయల విజయ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయ్ కి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో నేడు విజయ్ విచారణకు హాజరయ్యారు. 

విచారణ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఐడీ అధికారులు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. టీడీపీ సోషల్ మీడియా, ఐటీడీపీ గురించి అడిగారని... సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పానని తెలిపారు.  

వచ్చే  నెల 16న మళ్లీ విచారణకు రావాలని సీఐడీ అధికారులు చెప్పారని విజయ్ వివరించారు. అయితే, సీఐడీ అధికారులు, పోలీసుల గురించి తాను మాట్లాడదలుచుకోలేదని, ఒక ఆదేశాలకు అనుగుణంగా వారు పనిచేస్తుంటారని వివరించారు. ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరన్నదే ఇక్కడ ముఖ్యమని విజయ్ వ్యాఖ్యానించారు.

బీసీలను వేధించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ వైఖరి ఉందని, గతంలో అచ్చెన్నాయుడు, గౌతు శిరీషను కూడా ఇలాగే వేధించారని తెలిపారు.
Chintakayala Prabhakar
CID
Guntur
TDP

More Telugu News