ఓ జనసైనికుడికి మొబైల్ ఫోన్ ను బహూకరించిన పవన్ కల్యాణ్

  • పల్నాడు ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించనున్న బాలాజీ
  • బైక్ పై పెట్టె ఏర్పాటు చేసుకున్న వైనం
  • పల్నాడు ప్రజా సమస్యల పెట్టెగా నామకరణం
  • ప్రోత్సాహక నగదు అందజేసిన పవన్
Pawan Kalyan presents a mobile phone to party worker Balaji

పల్నాడు జిల్లాకు చెందిన బాలాజీ అనే జనసైనికుడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకుని, ఆ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని వినూత్న కార్యక్రమం చేపట్టిన బాలాజీని పవన్ మెచ్చుకున్నారు. 

బాలాజీ తన బైక్ పై ఓ పెట్టె ఏర్పాటు చేసుకుని, పల్నాడు ప్రాంతంలో గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రజాసమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పవన్ కు అందజేసేందుకు 'పల్నాడు ప్రజా సమస్యల పెట్టె' పేరిట సొంతంగా కార్యాచరణ అమలు చేయనున్నారు. 

బాలాజీ ఆలోచనను స్వాగతించిన పవన్.... అతడికి ఓ మొబైల్ ఫోన్, ప్రోత్సాహక నగదు అందజేశారు. పవన్ ఆ కార్యకర్తతో ముచ్చటించి, అతడిలో ఉత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

More Telugu News