ప్రాణాలైనా ఇచ్చేస్తా కానీ బీజేపీతో మళ్లీ చేతులు కలపను: బీహార్ సీఎం నితీశ్ కుమార్

  • ఆ పార్టీతో కలిసి నడిచేదేలేదని స్పష్టం చేసిన నితీశ్ 
  • బీజేపీ ప్రస్తుత నాయకత్వం అహంకార పూరితంగా ఉందని విమర్శ
  • గతేడాది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీశ్ 
Will rather die than join hands with BJP again says Nitish Kumar

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకునేది లేదని సోమవారం ప్రకటించారు. 'నా ఊపిరి ఉన్నంత వరకు మళ్లీ బీజేపీతో కలిసి వెళ్లను. మరణాన్నిఅయినా అంగీకరిస్తాను కానీ బీజేపీతో కలిసి నడవను’’ అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, బీజేపీనే బలవంతంగా తనను సీఎం చేసిందన్నారు. ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు. 

బీజేపీ ప్రస్తుత నాయకత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తుందన్న నితీశ్.. అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీల హయాంను గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి, అద్వానీలను తాను గౌరవిస్తామని, ఎల్లప్పుడూ వారికి అనుకూలంగా ఉన్నామని చెప్పారు.

More Telugu News