Devineni Uma: టీడీపీ అధికారంలోకి వస్తే ఇద్దరు నానిలు దేశం విడిచి పారిపోతారు: దేవినేని ఉమ

Kodali Nani and Perni Nani will run out of country if TDP wins says Devineni Uma
  • తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే విజయ్ పై కేసు పెట్టారన్న దేవినేని ఉమ
  • కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని విమర్శ
  • సజ్జల మాట విన్న గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలని వ్యాఖ్య
టీడీపీ నేత చింతకాయల విజయ్ పై తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే కేసు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం నీతి నియమాలతో బతుకుతోందని అన్నారు. సెంటుభూమి కోసం అయ్యన్నపై ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారని విమర్శించారు. ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతోందని అన్నారు. 

సజ్జల మాటవిన్న గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలని చెప్పారు. దోచుకున్న డబ్బును కాపాడుకునేందుకు కొడాలి నాని, పేర్ని నానిలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు నానిలు హైదరాబాద్ లో దాక్కున్నారని... ఇప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే దేశం విడిచి పారిపోతారని వ్యాఖ్యానించారు.
Devineni Uma
Telugudesam
Sajjala Ramakrishna Reddy
Kodali Nani
Perni Nani
YSRCP

More Telugu News