Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పై రష్మిక మందన్న స్పందన

Whats wrong in going to Maldives with Vijay Devarakonda asks Rashmika Mandanna
  • ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కొంత కాలంగా ప్రచారం
  • ఈ మధ్యనే మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లిన జంట
  • ఇద్దరం కలిసి ట్రిప్ కు వెళ్తే తప్పేముందన్న రష్మిక
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ చాలా కాలంగా పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఈ మధ్యనే ఈ జంట మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లి ఏకాంత సమయాన్ని గడపడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. వీరి ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అయితే, ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందిస్తూ... విజయ్ తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు వెళ్లింది నిజమేనని... అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పింది. ఇద్దరం కలిసి ట్రిప్ కు వెళ్తే తప్పేముందని ప్రశ్నించింది. సినిమాల విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి నటించిన 'గీత గోవిందం' సూపర్ హిట్ అయింది. 'డియర్ కామ్రేడ్' చిత్రంలో కూడా ఇద్దరూ కలిసి నటించారు.
Rashmika Mandanna
Vijay Devarakonda
Relationship
Tollywood

More Telugu News