కనకమేడల రవీంద్రకు బైపాస్ సర్జరీ... పరామర్శించిన చంద్రబాబు

  • హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనకమేడల
  • ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు
  • కనకమేడల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న టీడీపీ అధినేత
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడి
Chandrababu visits Kanakamedala Ravindra Kumar in Star Hospital

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కు ఇటీవల బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న కనకమేడలను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కనకమేడల కుటుంబ సభ్యులతోనూ చంద్రబాబు మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. 

కాగా, జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, కనకమేడల హాజరయ్యే అవకాశాలు లేవు. ఆయన కోలుకుని పూర్తి ఆరోగ్యం సంతరించుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది.

More Telugu News