సింహాలు ఇంటర్వ్యూలు ఇస్తాయా?.. అందుకే నేనూ ఇవ్వలేదు: షారుఖ్

  • ప్రమోషన్స్ నిర్వహించకున్నా.. పఠాన్ గర్జిస్తోందని ఓ అభిమాని ట్వీట్
  • సింహాలు ఇంటర్వ్యూలు ఇవ్వవని, అడవికి వచ్చి సినిమా చూడాలని షారుఖ్ కామెంట్
  • ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ‘ఆస్క్ ఎస్ఆర్ కే’ లో ఫన్నీ సమాధానాలిచ్చిన బాద్ షా
Shah Rukh Khans Epic Reply To Why He Didnt Promote Pathaan

రోజుకు రూ.100 కోట్ల కలెక్షన్లతో పఠాన్ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా రాబట్టింది. సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ట్విట్టర్ లో ‘ఆస్క్ ఎస్ఆర్ కే’ పేరుతో అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు.. షారుఖ్ చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.

‘మన దేశంలో ఎలాంటి  ప్రమోషన్స్ నిర్వహించకున్నా.. ప్రీ-రిలీజ్ ఇంటరాక్షన్ లేకున్నా పఠాన్ గర్జిస్తోంది’ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన షారుఖ్.. ‘‘సింహాలు ఇంటర్వ్యూలు ఇవ్వవని నేను అనుకున్నాను. అందుకే ఈసారి కూడా నేను ఇంటర్వ్యూలు ఇవ్వకూడదనుకున్నా. అడవికి రండి.. సినిమా చూడండి” అని పేర్కొన్నాడు.

మరో అభిమాని వేసిన కౌంటర్ కు.. షారుఖ్ ఇలానే బదులిచ్చాడు. ‘‘పఠాన్ హిట్.. కానీ మీరు బాక్సాఫీస్ వద్ద సల్మాన్ ఖాన్‌తో పోటీ పడలేరు’’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన బాద్ షా.. ‘‘సల్మాన్ భాయ్ ని.. యువకులు  గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’ అంటుంటారు’’ అని బదులిచ్చాడు. 

‘‘నేను సల్మాన్ ఖాన్ అభిమానిగా సినిమాకు వెళ్లాను.. కానీ పఠాన్ అభిమానిగా బయటికి వచ్చాను’’ అని ఇంకొకరు ట్వీట్ చేయగా.. ‘‘నేను కూడా టైగర్ కు ఫ్యాన్ నే బ్రదర్. ఆయనతో పాటు నన్ను కూడా మీ హృదయంలో ఉంచుకోండి’’ అని పేర్కొన్నాడు.

More Telugu News