కాలా ఛష్మా పాటకు తైవానీ పౌరుల అదిరిపోయే డ్యాన్స్.. వీడియో ఇదిగో!

  • పెళ్లి వేడుకల్లో యువకుల బృందం నృత్యం
  • ఏళ్లు గడిచినా కాలా ఛష్మా పాటకు తగ్గని క్రేజ్
  • సోషల్ మీడియాలో మరోమారు వైరల్ గా మారిన వీడియో
Taiwanese Groups Energetic Performance On Kala Chashma Wows Internet

సినిమా విడుదలై ఆరేళ్లు గడిచినా అందులోని ఓ పాటకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.. భారత్ లోనే కాదు విదేశాల్లోనూ ఇప్పటికీ పలు సందర్భాలలో ఆ పాట మార్మోగుతోంది. అదే.. బార్ బార్ దేఖో సినిమాలోని కాలా ఛష్మా పాట! తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో మరోమారు వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ వీడియో గతేడాది అక్టోబర్ లో తీసినది, అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తైవాన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కొంతమంది డ్యాన్సర్లు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. (వీడియో లింక్)

ముందుగా మ్యారేజ్ హాల్ లో యువకుల బృందం ఈ పాటకు డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో ఓ యువతి ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతుంది. చుట్టూ కూర్చున్న అతిథులు చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేస్తూనే తమ తమ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. ఈ వీడియోను ఉల్ జాంగ్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ నెల 7న రీ పోస్టు చేయగా.. నెటిజన్ల నుంచి స్పందన మామూలుగా లేదు. 

ఈ వీడియోకు ఏకంగా 4.38 లక్షల లైకులు రాగా, 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్ల విషయానికి వస్తే.. అద్భుతంగా చేశారని చాలామంది యూజర్లు మెచ్చుకున్నారు. ఈ రోజుల్లో బాలీవుడ్ పాట లేకుండా వివాహ తంతు పూర్తికాదని మరొక యూజర్ కామెంట్ చేశారు. సంగీతానికి భాష అడ్డుగోడ కాబోదని ఈ పాట నిరూపించిందని మరికొందరు కామెంట్ చేశారు.

More Telugu News