జీన్స్ ధరించి కోర్టుకొచ్చిన సీనియర్ న్యాయవాది.. బయటకు పంపిన న్యాయమూర్తి

  • గౌహతి హైకోర్టులో ఘటన
  • వస్త్రధారణ చూసి బయటకు పంపాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం
  • అదే కారణంతో కోర్టు విచారణ వారం రోజుల వాయిదా
Gauhati High Court advocate Bijan Mahajan removed from court for wearing jeans

జీన్స్ ధరించి కోర్టుకు వచ్చిన సీనియర్ న్యాయవాదికి చేదు అనుభవం ఎదురైంది. న్యాయమూర్తి ఆయనను బయటకు పంపడమే కాకుండా కేసు విచారణను కూడా వాయిదా వేశారు. అస్సాంలోని గౌహతి హైకోర్టులో జరిగిందీ ఘటన. ఓ కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ కోసం సీనియర్ న్యాయవాది బీకే మహాజన్ కోర్టుకు హాజరయ్యారు.

తన క్లయింట్ తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధమైన ఆయనను గమనించిన జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా ఆధ్వర్యంలోని ధర్మాసనం వెంటనే విచారణను నిలిపివేసింది. న్యాయవాది జీన్స్ ధరించి ఉండడాన్ని గమనించిన ధర్మాసనం.. పోలీసులను పిలిచి న్యాయవాది మహాజన్‌ను బయటకు పంపాలని ఆదేశించింది. అంతేకాకుండా ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను వారం రోజులపాటు వాయిదా వేస్తూ జస్టిస్ సురానా ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News