మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత

  • వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వట్టి
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి
  • 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న వైనం
Former AP Minister Vatti Vasanth Kumar Passed Away

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. వట్టి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్టణంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పూళ్ల ఆయన స్వగ్రామం. 

ఉంగుటూరు నుంచి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య,  కిరణ్‌ కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాతి నుంచి రాజకీయాలకు దూరమయ్యారు. వసంతకుమార్ భౌతికకాయాన్ని విశాఖ నుంచి స్వగ్రామం తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

More Telugu News