అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

  • సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య లైఫ్ పై పలు రూమర్లు
  • శోభిత దూళిపాళ, ఆ తర్వాత దివ్యాంశతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు
  • ఈ వార్తల్లో నిజం లేదన్న దివ్యాంశ
Actress Divyamsha response on relationship with Naga Chaitanya

సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య పర్సనల్ లైఫ్ పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. హీరోయిన్ శోభిత దూళిపాళతో చైతన్య రిలేషన్ లో ఉన్నాడంటూ చాలా కాలంగా వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో నాగచైతన్య ప్రేమాయణం నడుపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. వీరిద్దరూ 'మజిలీ' అనే సినిమాలో నటించారు. అంతేకాదు... 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడానికి నాగచైతన్య కారణమనే వార్తలు కూడా వినిపించాయి. 

ఈ నేపథ్యంలో, దివ్యాంశ ఈ వార్తలపై స్పందించింది. నాగచైతన్య చాలా బాగుంటాడని.. ఐలవ్ చై అని చెప్పింది. అతనిపై తనకు క్రష్ ఉందని... అయితే, తాము పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో తనకు ఛాన్స్ రావడానికి నాగచైతన్య కారణమనే వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేసింది.

More Telugu News