Tarakaratna: తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స... బెంగళూరు తరలివెళ్లిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు

Nandamuri family members arrives Narayana Hrudayalaya in Bengaluru
  • లోకేశ్ పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు
  • కుప్పం ఆసుపత్రి నుంచి బెంగళూరు తరలింపు
  • నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న తండ్రి మోహనకృష్ణ
  • కాసేపట్లో బెంగళూరుకు చంద్రబాబు
నిన్న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. గత రాత్రి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరు తరలించారు. 

ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తారకరత్న తండ్రి మోహనకృష్ణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. పురందేశ్వరి, నందమూరి సుహాసిని తదితర నందమూరి కుటుంబసభ్యులు కూడా బెంగళూరు తరలివెళ్లారు. 

టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, పరిటాల శ్రీరామ్ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరు ఆసుపత్రికి చేరుకోనున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
Tarakaratna
Narayana Hrudayalaya
Nandamuri
TDP
Bengaluru

More Telugu News