అలా చేస్తే జంధ్యాలకి చాలా కోపం వచ్చేదట!

  • హాస్యకథా చిత్రాల దర్శకుడిగా జంధ్యాలకి పేరు 
  • ఫోన్లోనే అప్పటికప్పుడు డైలాగ్స్ చెప్పేవారన్న అర్థాంగి అన్నపూర్ణ
  • తాను రాసిన సన్నివేశాలు సరిగ్గా తీయకపోయినా ఆయనకి కోపం వచ్చేదని వెల్లడి  
  • అందుకే ఆయన డైరెక్టర్ గా మారారని వెల్లడి
Annapurna Interview

జంధ్యాల .. తెలుగు తెరపై హాస్య కథలను పరుగులు తీయించిన దర్శక రచయిత. ఎంతోమంది నటీనటులను ఆయన తెరకి పరిచయం చేశారు. అలాంటి జంధ్యాలను గురించి ఆయన అర్థాంగి అన్నపూర్ణ మాట్లాడుతూ .. "మా వివాహమైన ఏడాదిన్నరకే నన్ను తీసుకుని ఆయన మద్రాసుకి వచ్చేశారు. అక్కడే కె విశ్వనాథ్ గారితోను .. ఏడిద నాగేశ్వరరావుగారితోను పరిచయం ఏర్పడింది" అన్నారు. 

"జంధ్యాలగారు పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. దర్శకులు వేరే లొకేషన్స్ నుంచి కాల్ చేస్తే, ఫోన్ లోనే డైలాగ్స్ చెప్పేసేవారు. స్క్రీన్ ప్లే ఒకసారి చెబితే ఆయనకి గుర్తుండిపోయేది. ఈ విషయంలో ఆయనను అందరూ మెచ్చుకునేవారు. జంధ్యాలకి ఒక సినిమాను అప్పగిస్తే ఇక ధైర్యంగా ఉండొచ్చని ఏడిద నాగేశ్వరరావుగారు అనేవారు. 

" ఇక తాను రాసిన సన్నివేశాలు సరిగ్గా తీయకపోయినా .. డైరెక్టర్లు మార్చుకున్నది నచ్చకపోయినా ఆయనకి కోపం వచ్చేది. ఆ తరువాత సినిమాకి రాయమని అడిగితే రాసేవారు కాదు. ఇక ఆ తరువాత .. తాను రాసుకున్నది తాను తీసుకుంటేనే కరెక్టుగా ఉంటుందని ఆయన భావించారు. అప్పటి నుంచి తాను డైరెక్టర్ గా మారిపోయారు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News