RRR: జపాన్​ లో ఆర్​ఆర్​ఆర్​ శతదినోత్సవం.. తొలి భారత చిత్రంగా రికార్డు

 RRR Movie Completed 100 days by today in Japan
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని తెచ్చిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’ భారత దేశంలో అఖండ విజయం సాధించింది. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఈ మధ్యే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అస్కార్ పురస్కారానికి కూడా నామినేట్ అయింది. ఇదిలా ఉండగా జపాన్ లో మూడు నెలల కిందట విడుదైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ 42 కేంద్రాల్లో నేరుగా, షిఫ్ట్స్ పద్ధతిలో మరో 114 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. 

ఇన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. గతేడాది అక్టోబర్ 21న జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. చిత్రం శతదినోత్సవ మార్కు దాటిన విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విటర్ ద్వారా తెలిజేశారు. జపాన్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆ రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు నడుస్తుండటం చాలా పెద్ద విషయం. కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది. ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి. కానీ జపనీస్ అభిమానులు మాకు తిరిగి ఆ ఆనందాన్ని కలిగించారు.  లవ్ యూ జపాన్’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
RRR
Rajamouli
Japan
100 days
record

More Telugu News